Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు
20-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లక్కారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు

భారత రత్న, ఆధునిక సాంకేతిక విప్లవ నిర్మాత, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశంలో కంప్యూటర్, ఐటీ విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీయేనని గుర్తుచేశారు. యువతకు సాధికారత కల్పిస్తూ 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశ ఐక్యత, సమానత్వం కోసం రాజీవ్ గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ తిగుళ్ళ చంద్రయ్య, కో ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, పస్తం గంగారాం, దేవాలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు డిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్, బోయ వెంకట్, చిమ్ముల వెంకట్ రెడ్డి, శంకర్ నాయక్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్క శ్రీనాథ్, బత్తుల శ్రీహరి, షాదీ ఖానా చైర్మన్ ఎం.డి. కరీం, ఆవుల యేసు, లచ్చునాయక్, బండమీద వెంకటేశం, తొర్పునూరి శ్రీకాంత్, కడగంచి జనార్ధన్, పాశం కృష్ణ, కొండె నరసింహ, ఉదరీ రమేష్, నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News