Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు

20-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు

అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి: ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

మహిళల భద్రత, బాలల రక్షణే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు ఈ కార్యక్రమాలను చేపట్టారు.​ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, గృహ హింస, బాలల అక్రమ రవాణా, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు సూచించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

​సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే నేరాల రహిత వాతావరణం సాధ్యమవుతుందని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Sthanikam

యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా మహిళలు, బాలల భద్రతపై అవగాహన సదస్సులు

Article Image

జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు

అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి: ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్

మహిళల భద్రత, బాలల రక్షణే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అధికారులు ఈ కార్యక్రమాలను చేపట్టారు.​ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, గృహ హింస, బాలల అక్రమ రవాణా, వేధింపుల నివారణపై అవగాహన కల్పించారు. ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని అధికారులు సూచించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

​సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే నేరాల రహిత వాతావరణం సాధ్యమవుతుందని, ఈ దిశగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News