Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:40 AM

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ

21-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కొండమల్లేపల్లి నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ అని రామన్నపేట మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

రూపారెడ్డి హత్యను నిరసిస్తూ శుక్రవారం మండల వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బంద్‌ నిర్వహించారు. వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి సుభాష్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సుభాష్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు కరెస్పాండెంట్లు మాట్లాడుతూ.. నేటి విద్యా వ్యవస్థలో కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ధోరణి ఆందోళనకరంగా మారుతోందని అన్నారు. సమాజ నిర్మాణంలో గురుతర బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ లేకపోవడం విద్యా వ్యవస్థ మనుగడకే పెను ముప్పుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూపారెడ్డి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు టి. మల్లిఖార్జున్, జె. మార్టిన్, జి. నరేందర్‌రెడ్డి, కనకచారి, నాగరాజు, శ్రీధర్‌తో పాటు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య విద్యా వ్యవస్థకే మాయని మచ్చ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News