Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

21-08-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక భవానీ నగర్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారి వ్రత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ​ఈ సందర్భంగా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని మహిళా భక్తులు తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు పదిలంగా ఉండాలని కోరుకుంటూ, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో వందలాది మంది మహిళలు ఏకమై సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. ​ఈ మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి (గురుస్వామి), ధర్మకర్తలు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, గగులోతు అరుణ శంకర్ నాయక్, దాడి యశ్వంత్ రెడ్డి, ట్రినిటీ విద్యాలయాల ప్రిన్సిపల్ ఉజ్జిని మంజుల, పెద్ది స్వాతి కిషోర్ శర్మ, ఉప్పల కుసుమ, చింతల విజయలక్ష్మి, చింతల కరుణ, ఉప్పల దీపిక, పల్సం శ్రావణి, జక్కర్తి స్వాతి, దేవరపల్లి కరుణశ్రీ, దాచేపల్లి లక్ష్మి, దాచేపల్లి రమాదేవి, సింగరికొండ శైలజ, గర్దాసు లక్ష్మి, పారా అనసూయ, మిరియాల లక్ష్మీ ప్రియ, మొగుదాల వెంకటేష్ గౌడ్, బొడ్డు రాజేందర్ రెడ్డి, కాసాని అయిలమ్మ, మునుకుంట్ల జయమ్మ, బడుగు గౌరీశ్వరి, బొబ్బిళ్ళ యశోద, చింతకింది ప్రవళిక, సుర్వి జంగమ్మ, రేగలగడ్డ శిరీష, సుర్వి నికిత, బాలగోని ప్రగతి తదితర భక్తజనం పాల్గొన్నారు.

Sthanikam

సీతారామచంద్రస్వామి ఆలయంలో కన్నులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News