Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తాటి బెల్లం టీ పాయింట్ వద్ద నూతన బిర్యానీ పాయింట్ ప్రారంభం తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 05:34 PM

ప్రి ప్రైమరీ నియామకాలు ఏవీ?

ప్రి ప్రైమరీ నియామకాలు ఏవీ?

ప్రి ప్రైమరీ నియామకాలు ఏవీ?
21-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలైనా పూర్తికాని ప్రక్రియ..

డీఈఓ, కలెక్టరేట్ వద్ద టీఎస్ యూటీఎఫ్ ధర్నా..

నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ ప్రైమరీ విభాగాలకు వెంటనే ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) డిమాండ్ చేసింది. నియామక ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం ఎదుట డీఈఓ జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ...

రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతంగా ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టినప్పటికీ, నల్లగొండ జిల్లాలోని 124 కేంద్రాల్లో సిబ్బంది నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి రెండు నెలలు కావస్తున్నా ప్రక్రియ ముందుకు పడకపోవడంతో విద్యార్థుల బోధన తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులపైనే అదనపు భారం పడుతోందని ఫలితంగా ఇతర తరగతుల బోధనకూ విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాలు పూర్తవకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని, దీనివల్ల వారిపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగానే ప్రక్రియ ఆగిపోయిందనడంలో అర్థం లేదని, అధికారులు చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసచారి మాట్లాడుతూ... డీఈఓ కార్యాలయం వెంటనే స్పందించి 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నాయకులు డీఈఓ, కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్‌రెడ్డి, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, ఎ. చిన్న వెంకన్న, కొమరాజు సైదులు, నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, యరనాగుల సైదులు, రాగి రాకేష్, సి.హెచ్.రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సంధ్య, నాగయ్య తదితరులతో పాటు మెరిట్ జాబితాలోని అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రి ప్రైమరీ నియామకాలు ఏవీ?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News