Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:43 AM

మంచాల మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కిట్ బ్యాగుల పంపిణీ

21-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులకు అండగా టాలెంట్ ఫార్ములా

: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కిట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టాలెంట్ ఫార్ములా అడ్వైజరీ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో మంచాల మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కిట్ బ్యాగులను అందజేశారు.

ఈ సందర్భంగా టాలెంట్ ఫార్ములా COO క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, వారి విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతృప్తినిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఏకలవ్య ఫౌండేషన్ కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం కల్పించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత కిట్ బ్యాగుల పంపిణీ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన టాలెంట్ ఫార్ములా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టాలెంట్ ఫార్ములా ప్రతినిధులు క్రాంతి కిరణ్, క్రిస్, రిచర్డ్, దివ్య, స్నేహ, శ్రీకర్, ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ రవీందర్, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్, పుల్లారెడ్డి, శంకర్, బాల్‌రాజ్, జగదీశ్‌తో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మంచాల మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కిట్ బ్యాగుల పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News