Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

మార్కెట్‌ యార్డులో ధాన్యం చోరీ..!

మార్కెట్‌ యార్డులో ధాన్యం చోరీ..!

మార్కెట్‌ యార్డులో ధాన్యం చోరీ..!
21-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చోరీని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌.. బంగారం తాకట్టు పెట్టించి మరీ వసూళ్లా?

చండూరు: మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్‌ యార్డులో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం భారీగా చోరీకి గురైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ధాన్యం చోరీ వ్యవహారాన్ని కొందరు యువకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మార్కెట్‌ యార్డులో ధాన్యం మాయమవుతున్న విషయాన్ని గుర్తించిన కొందరు యువకులు.. చోరీకి పాల్పడిన వ్యక్తిని బెదిరించి, ఈ విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు వ్యక్తి తన వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే అసలు ఎంత మొత్తంలో ప్రభుత్వ ధాన్యం మాయమైంది? చోరీ వెనుక ఒక్కరే ఉన్నారా? మరికొందరి ప్రమేయం ఉందా? ప్రభుత్వ ఆస్తి చోరీ విషయం తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, దానిని అడ్డుపెట్టుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.చోరీ ఒక నేరమైతే.. దాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం మరో నేరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సమగ్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ప్రభుత్వ ధాన్యం చోరీకి పాల్పడిన వారితో పాటు, చోరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

దర్యాప్తుతోనే నిజాలు వెలుగులోకి రావాలిమార్కెట్‌ యార్డులో ప్రభుత్వ ధాన్యం భద్రత, పర్యవేక్షణలో లోపాలు ఏమైనా ఉన్నాయా? చోరీ ఎంతకాలంగా కొనసాగుతోంది? ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Sthanikam

మార్కెట్‌ యార్డులో ధాన్యం చోరీ..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News