Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:04 PM

సూర్యాపేటలో ప్రైవేట్ ఉపాధ్యాయుల శాంతియుత నిరసన ర్యాలీ

21-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి గ్రామంలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురి కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ యునైటెడ్ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్ టీచర్ అండ్ లెక్చరర్న ఫెడరేషన ఆద్వర్యంలో శుక్రవారం 2వేల మంది ఉపాద్యాయులు, ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువదని అలాంటి గురువును దారుణంగా హత్య చేయడం దారుణమన్నారు. ఏ గురువైనా విద్యార్ధులను మంచిగా ఉండమని చెబుతారు తప్ప చెడిపోమ్మని కాదన్నారు. తమ నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు గంజాయికి బానిసై, మాదకద్రవ్యాలకు అలవాటు పడి చెడు ప్రవర్తనతో ఉంటే మందలించడం రూపారెడ్డి తప్పా అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర భారతదేశంలో టీచర్లకు రక్షణ, కఠిన చట్టాలు లేక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వాలు స్పందించి నవతరాన్ని తయారు చేసే ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు వారి కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఏది చెప్పినా అది మన మంచి కోసమే అని విద్యార్థులు గ్రహించాలని అప్పుడే వారు మంచి పౌరులుగా సమాజంలో రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు త్రివేణి హరి, ఆర్.ప్రకాష్రెడ్డి, పగడాల ఉపేందర్రెడ్డి, రామసాని శ్రీనివాసనాయుడు, ఖమ్మంపాటి భిక్షపతి, గాలి రమేష్, మారం లింగారెడ్డి, వెంపటి అజయ్కుమార్, తీగల ఉపేందర్రావు, టీపీటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహరావు, గౌరవాధ్యక్షులు సోమరాజు, ఉపాధ్యక్షులు బాలక్రిష్ణ, రాజశేఖర్ లతో పాటు పెద్ద ఎత్తున ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Sthanikam

సూర్యాపేటలో ప్రైవేట్ ఉపాధ్యాయుల శాంతియుత నిరసన ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News