హైదరాబాద్: రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ది హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు.
హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో శ్రీనివాస్‌కు మంత్రి అవార్డును అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి, ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొని ముచ్చర్ల శ్రీనివాస్‌ను అభినందించారు. పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి