Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

గురుకులంలో విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారా?

23-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారని ఆరోపణలు.

విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ.

దామరచర్ల: తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలనే ఉద్దేశంతో బీసీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పిస్తే.. అక్కడ విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వెలువడటం ఆందోళన కలిగిస్తోంది. దామరచర్లలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కొంతమంది విద్యార్థినులతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, మరికొంతమందితో వంటకు సంబంధించిన పనులు చేయిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నల్లగొండ జిల్లా కమిటీ ఆరోపించింది.

విద్యార్థినుల చదువుపై దృష్టి పెట్టాల్సిన పాఠశాల యాజమాన్యం, ఆర్‌సీవో, ప్రిన్సిపాల్ విద్యార్థులను పని మనుషులుగా ఉపయోగించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పేర్కొన్నారు. వంటశాలలో విద్యార్థినులు పనిచేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ పేర్కొంది. విద్యార్థినులతో వంటపనులు, ఇతర పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది.విద్యార్థినుల భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఏవైనా చర్యలు జరుగుతున్నట్లయితే వాటిని వెంటనే నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు.

Sthanikam

గురుకులంలో విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారా?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News