Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా

22-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్‌లోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, గ్రామాల్లోని సమస్యలను తమ పరిధిలో పరిష్కరించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, చెడు వ్యసనాలు, అనవసరమైన బెట్టింగ్ యాప్‌లకు యువత దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా నాయకులు కృషి చేయాలని, నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి జహీరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం, ఒకే విధమైన దుస్తులను అందించారు. కార్యక్రమంలో ప్రశాంత్, రాములు, భాగవత్, సోహెల్, శ్రీకాంత్, భాను ప్రసాద్, ఆసిఫ్ మియా, గుండప్ప, కల్లెప్ప, కృష్ణచారి, అవినాష్ రెడ్డి, మోహన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News