Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం

22-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపించి గోల్డ్, సిల్వర్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన అనంతరం డబ్బులు, రాబడులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటన జహీరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ టౌన్‌కు చెందిన మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి, నాగరిగారి విల్లీ ఫ్రాన్సిస్, పోతురాజు అరవింద్‌తో పాటు మరో 22 మంది గత రెండేళ్లుగా హైదరాబాద్‌లోని నాయకీ ట్రేడర్స్ సంస్థలో సుమారు రూ.28 కోట్ల 14 లక్షల 57 వేల 128 పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొన్ని నెలల పాటు పెట్టుబడులపై వడ్డీ, లాభాల రూపంలో డబ్బులు చెల్లిస్తూ సంస్థ నిర్వాహకులు బాధితుల్లో నమ్మకం కల్పించినట్లు తెలిపారు. దీంతో సంస్థపై నమ్మకం పెరగడంతో బాధితులు విడతల వారీగా వివిధ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టుబడిగా అందించారు. అనంతరం పెట్టుబడులకు ఎలాంటి రాబడులు ఇవ్వకపోవడంతో పాటు అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిదిదొడ్డి ఇజ్రాయేలు బాబి, కొత్త శశిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ లవకుమార్, సీఐ ఆర్. రవి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మల్లెం శేషువర్ధన రెడ్డి శశువర్ధన్ రెడ్డి, బగ్గి రవీంద్రబాబు @ రవీందర్, దేవుల జగదీష్, పిండి సుష్మిత ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Sthanikam

జహీరాబాద్ బాధితులకు భారీ షాక్.. రూ.28.14 కోట్ల పెట్టుబడులు మాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News