Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి

22-08-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.​ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సురవరం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పోరాటాలను విస్తరించారని కొనియాడారు.​1998, 2004లలో ఎంపీగా గెలిచి ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య, రాచకొండ ఫైరింగ్ రేంజ్ రద్దు, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల కోసం ఆయన చేసిన పోరాటాలు అమోఘమని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, వెంకటేష్, రాములు, నర్సింహా, సుధాకర్, బిక్షపతి, రహమాన్, కృష్ణ, దర్శన్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News