Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:41 AM

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.

22-08-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మాజీ తొలి సర్పంచ్ జోగుల రామలింగయ్య కనిష్ఠ కుమారుడు, సికింద్రాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌ జోగుల నరసయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పోలీసు అవార్డు అందుకున్న సందర్భంగా గ్రామస్తులు ఆయనను ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన లక్ష్మాపురం గ్రామం నుంచి చిన్ననాటి నుంచే కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గ్రామానికి గర్వకారణమన్నారు. పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు గ్రామ అభివృద్ధికి కూడా నరసయ్య అనేక సందర్భాల్లో తనవంతు సహకారం అందించారని కొనియాడారు.భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. నరసయ్యకు అవార్డు రావడం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అభినందనలు తెలిపిన వారిలో మాజీ సర్పంచ్ ఉప్పు ప్రకాష్, శంభాల వెంకటేష్, నీల ఐలయ్య, మరోజు అనంతచారి, బత్తిని వెంకటేష్, వేముల పాపయ్య, బత్తుల రమేష్, ఆరూరి నరేష్, వంగల మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

Sthanikam

రాష్ట్రపతి చేతుల మీదుగా జోగుల నరసయ్యకు పోలీసు అవార్డు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News