Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:45 AM

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి.చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలి: జిల్లా వెంకటేష్ మాదిగ

22-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఆగస్టు 22: పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 97ను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ బి. చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (కార్మిక) శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు స్కిల్స్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన సభలో దళిత, గిరిజన వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ అభయహస్తం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు అందించాలని, రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మాల్గ యాదయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారపాక అంజి మాదిగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్, మునుగోడు ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పూదరి సైదులు, సాగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆదిమళ్ల సత్యనారాయణ, చనగళ్ల కోటేష్, యడవెళ్లి శ్రీనివాస్, రేపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి.చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయాలి: జిల్లా వెంకటేష్ మాదిగ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News