Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

పదవితో బాధ్యత పెరుగుతుంది.. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ఎస్పీ

22-08-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పోలీస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియను సిబ్బంది పరస్పర సమన్వయం, సహకారంతో ఎలాంటి ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు.జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హెడ్ కానిస్టేబుల్ ఎ. జనార్ధన్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఎస్‌ఐ బి. నాగలక్ష్మి ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా ఆర్‌ఐ రాజశేఖర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఎం. రాజారామ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి. సంతోష్ కుమార్, ఖజానాదారుగా కూన రమేష్ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందిస్తూ, పదవి రావడంతో బాధ్యత కూడా పెరుగుతుందని అన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం, వారి హక్కులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో అసోసియేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసిన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డిని కూడా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పదవితో బాధ్యత పెరుగుతుంది.. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News