Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి
23-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టర్ దివాకర టి.ఎస్.

కూసుమంచి రైతుల పొలాల్లో నిర్మిస్తున్న నీటి కుంటలు (ఫారం పాండ్లు) భూగర్భ జలాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐఏఎస్ అన్నారు. కూసుమంచి మండల కేంద్రానికి చెందిన రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు పొలంలో నిర్మిస్తున్న నీటి కుంటను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధాన రహదారి నుంచి సుమారు 600 మీటర్ల మేర డొంక రహదారిలో నడుచుకుంటూ వెళ్లి నీటి కుంట నిర్మాణ పనులను పరిశీలించడం విశేషం. వర్షపు నీటిని కుంటల్లో నిల్వ చేయడం ద్వారా నీరు భూమిలోకి ఇంకి సమీపంలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నీటి నిల్వలు పెరగడంతో భవిష్యత్తులో మత్స్య సంపద అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు తమ పొలాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీటి కుంట నిర్మాణం, పనుల పురోగతి, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, కూసుమంచి ఏడీఏ, గ్రామపంచాయతీ సర్పంచ్, ఏఓ, ఏపీఓ, ఈసీ, ఏఈఓ, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత టీఏలు, రైతులు, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నీటి కుంటలతో భూగర్భ జలాల అభివృద్ధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News