Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:33 AM

గురువు వృత్తి ఎంతో విలువైనది.

గురువు వృత్తి ఎంతో విలువైనది.

గురువు వృత్తి ఎంతో విలువైనది.
23-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SRI RAM NAGAR
గిరీష్ కుమార్

ప్రధానోపాధ్యాయులఉద్యోగవిరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి నరసింహ.

కందగట్ల గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి ఈరోజు ఉద్యోగ విరమణ పొందిన వాడపల్లి మురళీకృష్ణ గారికి కందగట్ల పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు హాజరై దంపతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని గురువులు భవిష్యత్తు వనరులను తీర్చి దిద్దుతారని అన్నారు. ఉపాధ్యాయునిగా మురళీకృష్ణ గారు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని అతని వద్ద విద్యను అభ్యసించిన ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై, ఆయనను సత్కరించడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మురళీకృష్ణ సార్ మా సొంత గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ సమయంలో సార్ అందించిన మోటివేషన్, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం మరియు సహకారం నా జీవితంలో ఎంతో ప్రభావం చూపాయి. సార్ నాకు ప్రత్యక్షంగా పాఠాలు బోధించకపోయినా, ఆయనను నేను ఎప్పుడూ నా గురువుగానే భావించాను. ఉపాధ్యాయ వృత్తి అనేది అత్యంత గౌరవప్రదమైనదే కాకుండా, ఎంతో బాధ్యతతో కూడుకున్న వృత్తి. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యను బోధించడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు. మురళీకృష్ణ సార్ ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ, తన ప్రతిభ, అంకితభావం మరియు సేవా తత్పరతతో ప్రధానోపాధ్యాయుని స్థాయికి చేరుకుని, ఈ రోజు పదవీ విరమణ పొందడం ఎంతో అభినందనీయం.

పదవీ విరమణ అనేది సేవకు ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం అన్నారు. ఇన్నేళ్లుగా సంపాదించిన అపారమైన జ్ఞానం, అనుభవం మరియు విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తూ, భావి సమాజానికి మరింతగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే, పదవీ విరమణ అనంతరం సార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

“ఉపాధ్యాయుని సేవకు పదవీ విరమణ ఉండొచ్చు… కానీ ఆయన బోధించిన విలువలకు, ఆయన చూపిన మార్గానికి ఎప్పటికీ పదవీ విరమణ ఉండదు అన్నారు.

Sthanikam

గురువు వృత్తి ఎంతో విలువైనది.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News