Sthanikam - Truth Matters
Logo

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

Updated : 29 Aug 2026 19:12 IST
As Preferred Source 1 min read
బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పట్నం లావణ్య (30) బట్టలను ఉతికి ఆరవేయడానికి ఇంటి పక్కనే ఉన్న పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది.బట్టలు ఆరవేసుకోవడానికి పశువుల షెడ్డు కు ఉన్న సిమెంట్ స్తంభాలకు ఇనుప వైరుతో దండెమును ఏర్పాటు చేసుకున్నారు. పశువుల షెడ్డు లో వెలుతురు కోసమని ఇంట్లో నుండి వైర్ ద్వారా కరెంట్ తీసుకోవడం జరిగింది. విద్యుత్ వైరు తేలి దండెముకు తాకడాన్ని గుర్తించని లావణ్య బట్టలు ఆరవేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రాంతంలో కాపాడడానికి ఎవరూ లేకపోవడంతో విద్యుత్ షాక్ కు బలైంది. మృతురాలు లావణ్య కు కొడుకు (12), కూతురు(8) ఉన్నారు. లావణ్య మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news