Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 03:48 PM

రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

29-08-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ద్విచక్ర వాహనం దొంగతనం జరిగిన రెండు గంటల్లోనే కేసును ఛేదించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నారాయణఖేడ్ ఎస్సై రాసుల శ్రీశైలం తెలిపారు. నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధి హట్యా నాయక్ తండాకు చెందిన మేఘావత్ హన్మ నాయక్ తన హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనం (TS15 ET 9659)ను శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలిపి ఉంచాడు. శనివారం ఉదయం వాహనం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై రాసుల శ్రీశైలం సిబ్బందితో కలిసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని సేకరించి చాకచక్యంగా దర్యాప్తు చేయగా, దొంగిలించబడిన వాహనం జూకల్ శివారులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించే చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన కొద్ది గంటల్లోనే వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాసుల శ్రీశైలం మాట్లాడుతూ ప్రజలు తమ ద్విచక్ర వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో నిలిపి ఉంచాలని, వాహనాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Sthanikam

రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News