Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:52 PM

నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘జాతీయ క్రీడా దినోత్సవం’

30-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ధ్యాన్‌చంద్ సేవలు చిరస్మరణీయం: ప్రిన్సిపాల్ నవనీత

స్థానిక నారాయణ హైస్కూల్‌లో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.​అనంతరం ప్రిన్సిపాల్ నవనీత మాట్లాడుతూ... మేజర్ ధ్యాన్‌చంద్ 1905 ఆగస్టు 29న అలహాబాద్‌లో జన్మించారని తెలిపారు. ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తూనే, లభించిన స్వల్ప సమయాన్నే సాధనకు ఉపయోగించుకుని హాకీలో అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. 1926లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన ఆయన, 1928 ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని గుర్తుచేశారు. క్రీడారంగానికి ఆయన చేసిన నిరుపమాన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా ప్రకారించిందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో ఛాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి, ఈ-కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, హైస్కూల్ డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ హైస్కూల్‌లో ఘనంగా ‘జాతీయ క్రీడా దినోత్సవం’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News