Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:56 PM

నల్గొండ జీజీహెచ్‌లో గర్భస్థ శిశు మరణ ఘటనపై విచారణ పూర్తి...

29-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి వెల్లడి...

వైద్యుల కొరత, ఖాళీల భర్తీపై మంత్రులు, అధికారులతో చర్చిస్తామని హామీ...

ఆసుపత్రిలో పటిష్ట భద్రతకు చర్యలు...

నల్గొండ : నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్)లో శుక్రవారం చోటుచేసుకున్న గర్భస్థ శిశు మరణ ఘటనపై అధికారులు విచారణ పూర్తి చేశారు. బాధితుల ఆరోపణలు, వైద్య సిబ్బంది వివరణలు మరియు ఆధారాలను సమగ్రంగా పరిశీలించి రూపొందించిన వివరాల నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జీజీహెచ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, వివిధ విభాగాల అధిపతులు (హెచ్ఓడీలు) మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ నీలాబాయితో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలోని సమస్యలతో పాటు గర్భస్థ శిశు మరణ ఉదంతంపై సుదీర్ఘంగా చర్చించారు.

సిబ్బంది కొరత పరిష్కారానికి కృషి...

సమీక్షలో గైనకాలజీ సహా పలు విభాగాల్లో ఎదురవుతున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరతను హెచ్ఓడీలు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ..రోగులకు ఇబ్బందులు కలగకుండా డ్యూటీలు కేటాయించడం, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో త్వరలోనే చర్చిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కొత్త నియామకాల ఫైళ్లకు వేగంగా ఆమోదం లభించేలా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

పటిష్టమైన భద్రత, మెరుగైన సేవలు...

ఆసుపత్రి పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. గైనకాలజీ విభాగంలో జరిగిన ఘటనపై నర్సింగ్ సూపరింటెండెంట్ నీలాబాయి అందించిన నివేదికను కూడా కలెక్టర్‌కు పంపినట్లు చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ​ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Sthanikam

నల్గొండ జీజీహెచ్‌లో గర్భస్థ శిశు మరణ ఘటనపై విచారణ పూర్తి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News