Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:28 AM

అప్పట్లో ఉద్యమం.. ఆ తర్వాత అధ్యయనం.. నేడు బహుజనుల న్యాయ పోరాటానికి అండగా...

25-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

చింతచెట్టు కింద చదువు నుంచి న్యాయవాద వృత్తి వరకు మాండ్ర మల్లయ్య ప్రస్థానం

సామాజిక ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ప్రయాణం.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగిన అధ్యయనం.. నేడు న్యాయవాదిగా బహుజన సమాజానికి అండగా నిలుస్తున్న ప్రస్థానం.. ఇదే మాండ్ర మల్లయ్య జీవిత కథ. 1973 అక్టోబర్ 6న అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లా పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో మాండ్ర లింగయ్య, మాండ్ర లచ్చమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్న కుటుంబంలో మల్లయ్య చివరి సంతానం.

చింతచెట్టు కింద మొదలైన చదువు

కోమటిపల్లి గ్రామంలో పాఠశాల సౌకర్యం లేని సమయంలో చింతచెట్టు కింద జయ జయ సార్ వద్ద ఒకటి, రెండో తరగతులు చదువుకున్నారు. చిన్ననాటే తనలో చదువుపై ఆసక్తిని పెంచిన జయ జయ సార్ ప్రోత్సాహం తన జీవితంపై ఎంతో ప్రభావం చూపిందని మల్లయ్య గుర్తుచేసుకుంటారు. అనంతరం తిమ్మాపురం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ సమయంలో నారాయణ సార్ కూడా తనలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలకంగా నిలిచారని చెబుతారు.

విద్యార్థి దశలోనే ఉద్యమ బాట

1988-89లో పదో తరగతి చదువుతున్న సమయంలోనే మల్లయ్యలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాల ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆగస్టు 15 సందర్భంగా సుమారు 50 నుంచి 100 మంది విద్యార్థులతో కలిసి బ్యాడ్జీలు ధరించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సమాజంలోని ప్రతి వర్గానికి నిజమైన స్వేచ్ఛ, సమానత్వం అందలేదనే ఆలోచనతో విద్యార్థుల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంపై అప్పటి ప్రధానోపాధ్యాయుడు జి. గురవయ్య ఆగ్రహం వ్యక్తం చేసి తల్లిదండ్రులతో కలిసి క్షమాపణ చెప్పాలని సూచించినా మల్లయ్య తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అయితే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే తనను క్షమించడంతో పాటు తన నెల జీతాన్ని బహుమతిగా ఇస్తానని ప్రధానోపాధ్యాయుడు చెప్పడం మల్లయ్య జీవితంలో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలింది. అనంతరం క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కాకపోయినా స్వయంగా పరీక్షలకు సిద్ధమై సరస్వతి పాఠశాల కేంద్రం నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు.

హెచ్‌ఈసీతో సామాజిక ఆలోచనలకు బాట

ఇంటర్మీడియట్ కోసం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ, నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్‌ఈసీకి అవకాశం లభించింది. సామాజిక, రాజకీయ అంశాలపై మరింత అధ్యయనం చేయాలనే ఆలోచనతో హెచ్‌ఈసీని ఎంచుకున్నారు. విద్యార్థి దశలోనే మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఏబీవీపీ ఉద్యమాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు.

మల్లయ్య ఉద్యమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. గురవయ్య ఒక సందర్భంలో తనను అభినందిస్తూ “నీ పేరు విన్నాను.. మంచి పని చేశావు.. ఇలాగే కొనసాగించు” అని చెప్పడం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని మల్లయ్య గుర్తుచేసుకుంటారు.

పీడీఎస్‌యూతో ఉద్యమ ప్రస్థానం

ఇంటర్మీడియట్ సమయంలోనే పీడీఎస్‌యూలో చేరి విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అప్పట్లో నల్గొండ జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్న వీరారెడ్డి నాయకత్వం, విద్యార్థి ఉద్యమ భావజాలం మల్లయ్యను ఆకర్షించాయి. ఈ క్రమంలో మారోజు వీరన్నతో కలిసి కూడా పలు సామాజిక, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశారు.

దేవరకొండ ప్రాంతంలో విద్యార్థి సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ సమయంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 1991లో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అనంతరం బీసీ హక్కుల కోసం జరిగిన పలు ఉద్యమాల్లో మారోజు వీరన్న మార్గదర్శకత్వంలో పాల్గొన్నారు. సూర్యాపేట నుంచి ములుగు వరకు నిర్వహించిన గొల్లకురుమ హక్కుల పోరాట పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కూడా ఆయన భాగస్వామ్యమయ్యారు.

వివాహం తర్వాత కొత్త ఆలోచన

1995 మే 25న పండగ నాగమణితో మల్లయ్య వివాహం జరిగింది. తన ఉద్యమ ప్రస్థానంలో జీవిత భాగస్వామి నాగమణి ఎంతో సహకరించారని మల్లయ్య చెబుతారు. వారి వివాహానికి చకిలం సూరిబాబు పెద్దగా వ్యవహరించి తనకు సహకరించారని గుర్తుచేసుకుంటారు.

వివాహం అనంతరం తన జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా మలుచుకోవాలనే ఆలోచనలో ఉన్న సమయంలో బీసీ ఉద్యమాలకు సంబంధించిన పలు సభల్లో పాల్గొన్నారు. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బీసీ మహాజన సభలో వేలాది మంది పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ బీసీల సామాజిక, రాజకీయ హక్కుల కోసం జరుగుతున్న చర్చలు ఆయనలో మరింత చైతన్యాన్ని పెంచాయి.

తెలుగు మీడియం నుంచి న్యాయ విద్య వరకు.. భాషా సవాలు

ఉద్యమ జీవితంలో ముందుకు సాగుతున్న సమయంలో న్యాయ విద్యను అభ్యసించాలని మల్లయ్య నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు మరో పెద్ద సవాలు ఎదురైంది. చిన్ననాటి నుంచి తెలుగు మాధ్యమంలో చదివిన మల్లయ్యకు న్యాయ విద్యలోని అన్ని సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో ఉండటంతో మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంగ్లిష్‌పై ప్రాథమిక పరిజ్ఞానం కూడా తక్కువగా ఉండటంతో లా చదువు పూర్తి చేయడం అంత సులభం కాదనే పరిస్థితి ఏర్పడింది.

అలాంటి సమయంలో నేటి మంచిర్యాల జిల్లా ఎస్పీ ఎగడి భాస్కర్ మల్లయ్యకు అండగా నిలిచారు. అప్పట్లో భాస్కర్ తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే గ్రూప్స్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. మల్లయ్యను కలిసిన ఆయన న్యాయ విద్యను మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలని ప్రోత్సహించారు. ఇంగ్లిష్‌పై ఉన్న భయాన్ని అధిగమించి కష్టపడితే తప్పకుండా లా పూర్తి చేయగలవని ధైర్యం చెప్పారు.

“తన లా పూర్తి చేయడానికి వెన్ను తట్టి ప్రోత్సహించింది భాస్కర్” అని మల్లయ్య నేటికీ కృతజ్ఞతగా గుర్తుచేసుకుంటారు. భాస్కర్ ఇచ్చిన ఆ ప్రోత్సాహం న్యాయ విద్యను పూర్తి చేయాలనే పట్టుదలను మరింత పెంచిందని చెబుతారు. ఒకవైపు ఇంగ్లిష్‌లోని న్యాయ సబ్జెక్టులను అర్థం చేసుకునేందుకు కష్టపడుతూనే మరోవైపు సామాజిక ఆలోచనలను కొనసాగిస్తూ న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.

న్యాయవాదిగా బహుజన సమాజానికి అండగా

1991 నుంచి పరిచయం ఉన్న నల్గొండకు చెందిన న్యాయవాది గోసుల మోహన్ కూడా మల్లయ్యను న్యాయ విద్య వైపు ప్రోత్సహించారు. న్యాయ విద్య ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మరింత సమర్థవంతంగా అండగా నిలవవచ్చనే ఆలోచనతో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్న మాండ్ర మల్లయ్య బహుజన సమాజానికి న్యాయపరమైన సహకారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యార్థి దశలో ఉద్యమాల ద్వారా సామాజిక సమస్యలను అర్థం చేసుకున్న ఆయన, అధ్యయనం ద్వారా వాటిని మరింత లోతుగా తెలుసుకుని, నేడు న్యాయవాదిగా చట్టపరమైన మార్గాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారు.

చిన్ననాటి చింతచెట్టు కింద మొదలైన విద్యాభ్యాసం నుంచి విద్యార్థి ఉద్యమాలు, సామాజిక పోరాటాలు, జైలు జీవితం, బీసీ హక్కుల ఉద్యమాలు, వివాహ జీవితం, న్యాయ విద్యలో ఎదురైన భాషా సవాళ్లు, సహచరుల ప్రోత్సాహం, న్యాయవాద వృత్తి వరకు మాండ్ర మల్లయ్య ప్రస్థానం అనేక మలుపులతో సాగింది. ఉద్యమంతో మొదలైన ప్రయాణం అధ్యయనం వైపు మళ్లి, నేడు న్యాయపోరాటం ద్వారా బహుజన సమాజానికి అండగా నిలిచే స్థాయికి చేరింది. ఇదే ఆయన జీవిత ప్రయాణంలోని ప్రత్యేకత.

Sthanikam

అప్పట్లో ఉద్యమం.. ఆ తర్వాత అధ్యయనం.. నేడు బహుజనుల న్యాయ పోరాటానికి అండగా...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News