చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్, మణికంఠ వెంచర్ల మధ్య ఉన్న సాధారణ సీసీ రోడ్డును కొందరు భూ ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన 'ప్రజవాణి' కార్యక్రమంలో జిల్లా అధికారులకు కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు వినతిపత్రం అందజేశారు.రోడ్డును ఆక్రమించడమే కాకుండా, రాకపోకలు సాగించే దారికి అడ్డంగా సిమెంట్ పలకలతో ప్రహరీ గోడ నిర్మించి మార్గాన్ని పూర్తిగా మూసివేశారని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజావసరాల కోసం ఉన్న రోడ్డును ఆక్రమించిన కబ్జాదారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రహరీ గోడను తొలగించి దారి పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
PRINT TIME: October 09, 2026 03:11 PM
రోడ్డు ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు ప్రజవాణిలో బాధితుల వినతిపత్రం

24-08-2026
220 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్, మణికంఠ వెంచర్ల మధ్య ఉన్న సాధారణ సీసీ రోడ్డును కొందరు భూ ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన 'ప్రజవాణి' కార్యక్రమంలో జిల్లా అధికారులకు కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు వినతిపత్రం అందజేశారు.రోడ్డును ఆక్రమించడమే కాకుండా, రాకపోకలు సాగించే దారికి అడ్డంగా సిమెంట్ పలకలతో ప్రహరీ గోడ నిర్మించి మార్గాన్ని పూర్తిగా మూసివేశారని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజావసరాల కోసం ఉన్న రోడ్డును ఆక్రమించిన కబ్జాదారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, ప్రహరీ గోడను తొలగించి దారి పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి