Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్

29-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ సమీక్ష సమావేశంలో పాఠశాలల పనితీరు, విద్యార్థుల అభ్యసన స్థాయులు, మూల్యాంకన ఫలితాలను ఆయన సమీక్షించారు.జిల్లాలోని 254 ఎఫ్‌ఎల్‌ఎన్‌ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి నిర్దేశిత సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మూల్యాంకన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్‌, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక బోధనా చర్యలు చేపట్టాలని, ప్రతి మండలంలో ఆకస్మిక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలని తెలిపారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, విద్యార్థుల అభ్యసన పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు నిర్దేశిత ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి, జిల్లా సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ బాలయ్య, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News