Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:58 PM

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం

29-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం రామ్ల తండాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వాంకుడోతు సరిత–మోతిరాం దంపతులు నిర్మించుకున్న నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ వాంకుడోతు హాథిరామ్, ఉప సర్పంచ్ జాటోత్ శాంతితో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News