Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట

28-08-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేటలోని శ్రీమతి జానకమ్మ రఘునాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన గుండం బావి పుష్కరిణి తీర్థ స్నాన కార్యక్రమం ఈనెల 30న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కరణం నరసింహారావు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ సర్వతోముఖ యాజి ఆధ్వర్యంలో శ్రావణ బహుళ విదియ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఉదయం 10 గంటలకు పుష్కరిణి తీర్థ స్నానం, 11 గంటలకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణ సమారాధనతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సంగీత విభావరి, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పుష్కరిణి తీర్థ స్నానం సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదని, పురాతన కాలం నుంచి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి తీర్థ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కరణం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణులు, భక్తులు, భజన బృందాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Sthanikam

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News