Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / కామారెడ్డి

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Updated : 28 Aug 2026 16:40 IST
As Preferred Source 1 min read
విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సూచించారు.అలాగే పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Sthanikam

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Article Image

జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సూచించారు.అలాగే పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి