మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం విద్యా అర్హతల్లో సవరణ...
నల్లగొండ : స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఈడీపీ (AEDP) విభాగాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రకటనలో కీలక సవరణలు చేసినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 22న జారీ చేసిన పత్రికా ప్రకటనకు కొనసాగింపుగా అదనపు ప్రకటన (Addendum) విడుదల చేశారు.. సవరించిన వివరాల ప్రకారం...హెల్త్ కేర్ మేనేజ్మెంట్ (UG)లో గతంలో ఎంఎస్సీ (జూవాలజీ) విద్యార్హత నిర్దేశించగా, దానిని సవరించి ఎంఎస్సీ (హెల్త్ కేర్ మేనేజ్మెంట్) లేదా ఎంఎస్సీ (మైక్రోబయోలజీ) లేదా ఎంఎస్సీ (జూవాలజీ) పూర్తి చేసిన వారిని అర్హులుగా చేర్చారు. ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ (UG) కోర్సుకు ఎం.ఫార్మసీ లేదా ఎంఎస్సీ (కెమిస్ట్రీ) అర్హత ఉండాలి. మార్కుల శాతం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సాధారణ అభ్యర్థులు కనీసం 55% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదనపు వెయిటేజీ నెట్ (NET), సెట్ (SET) లేదా పీహెచ్‌డీ అర్హతతో పాటు బోధనానుభవం ఉన్నవారికి ఎంపికలో అదనపు ప్రాధాన్యం ఇస్తారు.
ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ...
సవరించిన అర్హతల ప్రకారం కొత్త అభ్యర్థులు ఈ నెల 31న సాయంత్రం 5:00 గంటలలోపు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కన్వీనర్ ప్రొఫెసర్ టి. అరవింద సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులను సవరించిన అర్హతల ప్రకారమే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 22 నాటి ప్రకటనలోని ఇతర నియమ నిబంధనలన్నీ యథావిధిగా వర్తిస్తాయని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి