Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

"ఖేలో ఇండియా సంవాద్"

"ఖేలో ఇండియా సంవాద్"

"ఖేలో ఇండియా సంవాద్"
27-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకోబోయే మహోత్సవానికి ముందస్తుగా ఈరోజు కళాశాల విద్యార్థులతో, క్రీడాకారులతో "ఖేలో ఇండియా సంవాద్" కార్యక్రమంలో వర్చువల్ గా(ఆన్లైన్... జూమ్ మీటింగ్ ద్వారా) దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని విద్యార్థులతో సంభాషించారు. దేశంలోని ప్రతి జిల్లాకి రెండు కళాశాలలను ఎంపిక చేయగా అందులో సూర్యాపేట జిల్లాలో కె .ఆర్ .ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రత్యేకంగా "బి" కేటగిరి నందు ఎంపికయింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రోగ్రామ్ అధికారిగా వేముల వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. కళాశాల విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించే సృష్టికర్తలుగా విద్యార్థులు పయనించాలని, ఆలోచనలో కొత్త దృక్కోణాలు, సృజనాత్మకత అవకాశాలను పెంపొందించుకోవాలని, దేశ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఆయన అన్నారు. దేశంలోని క్రీడా వ్యవస్థను మెరుగుపరచడం 2036లో జరిగే ఒలంపిక్స్ కోసం అందరూ ప్రతిభను పెంపొందించుకోవాలని, పాలనలో యువత భాగస్వామ్యులు కావాలని, ఆయన పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ కోసం యువత శక్తివంతంగా తయారై బాధ్యతలు తెలుసుకొని హక్కులను అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలని, యువత మత్తు పదార్థాలను విడనాడి ఆలోచనలకు పదును పెట్టాలని ఆయన విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారి, సమన్వయకర్త వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్. పిచ్చిరెడ్డి, కోదాడ నియోజకవర్గ మై భారత్ సమన్వయకర్త వెంకట భవాని లతోపాటుగా కళాశాల సిబ్బంది జి.యాదగిరి, వి.బల భీమారావు, పి.రాజేష్, రత్నకుమారి,జి.వెంకన్న, కె.రామరాజు, కె.సతీష్,జి. నాగరాజు, ఎస్కే. ముస్తఫా, జె.తిరుపతయ్య, ఎస్.కె ఆరిఫ్ అలీ, కె.శాంతయ్య,ఎన్. జ్యోతిలక్ష్మి, ఆర్.చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వర చారి,టి.మమత, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

"ఖేలో ఇండియా సంవాద్"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News