Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:36 PM

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు
27-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠనగర్‌లో శ్రీ శ్రీ శ్రీ మద్దెలమ్మ అమ్మవారి 10వ వార్షిక బోనాల మహోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు గుర్రం నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో బయలుదేరి, బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం రామాలయం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ​బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం చౌటుప్పల్ కర్చీరు వద్ద శ్రీ శ్రీ మద్దెలమ్మ మాత నాట్య కళామండలి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ‘సారంగధర’ యక్షగాన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి, నాయకులు బడుగు లక్ష్మయ్య, బడుగు జయప్రకాష్, గోశిక అంజయ్య, వనం రాజు, చిక్క నరహరి, గోశిక కరుణాకర్, పెద్ది కృష్ణ, కందగట్ల ఆనంద్, పిల్లలమర్రి యాదగిరి, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, గోశిక పాండు, శాంతి శ్రీ, కోడి వనిత, బడుగు పావని, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, బడుగు శ్రీరాములు, గోశిక రవి, గజం బృహ మహర్షి, కోడి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మణికంఠనగర్‌లో వైభవంగా మద్దెలమ్మ బోనాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News