Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:17 PM

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి

26-08-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన టి.వై.జె.ఎఫ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో యూనియన్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ పటేల్, రెడ్డి వినోద్, హల్గే రాజు, మండల అధ్యక్షులు ఎన్. ప్రకాష్, లాల్ కుమార్, మధురుద్దీన్, సంజు, సుకల్తీర్ సర్పంచ్ నీలేష్ తదితరులు షేక్ జలీల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, సన్నిహితులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News