Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం

26-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సంఘటన ప్రాంతంలో స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ , వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Sthanikam

బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News