Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

26-08-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడంతో పాటు పశువుల నుంచి రక్షణ కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, రహదారుల వెంట, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, పాలకవర్గ సభ్యులు, పంచాయతి కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

Article Image

తుంగతుర్తి;

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడంతో పాటు పశువుల నుంచి రక్షణ కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, రహదారుల వెంట, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, పాలకవర్గ సభ్యులు, పంచాయతి కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News