Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి

26-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

, ఆగస్టు 25: రైతాంగం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంచిన సారంపల్లి మల్లారెడ్డి పార్థివదేహాన్ని స్థానిక సీపీఎం నాయకులతో కలిసి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేక అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగ సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ పరిరక్షణ, రైతుల హక్కుల సాధన కోసం సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం నిరంతరం పోరాడారని తెలిపారు. రైతు సమస్యలపై ఉద్యమాలు చేయడమే కాకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు అందించే స్థాయిలో వ్యవసాయ రంగంపై ఆయనకు లోతైన అవగాహన ఉండేదన్నారు.

అంతర్జాతీయ పరిణామాలను అధ్యయనం చేసి వాటి ప్రభావాలను భారత వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ పార్టీ, రైతు సంఘం శిక్షణ తరగతుల్లో కార్యకర్తలకు అవగాహన కల్పించేవారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరుల వినియోగం, సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యామ్నాయ పంటలు, గిట్టుబాటు ధరలు, రైతుల ఆర్థిక సమస్యలపై ఆయనకు విశేష పరిజ్ఞానం ఉందన్నారు.

రైతాంగ ఉద్యమాన్ని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు తీసుకెళ్లడంలో మల్లారెడ్డి చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రైతు సంఘం ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన మరణం రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. మల్లారెడ్డి ఆశయాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని మేక అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, నాయకులు వనం ఉపేందర్, రైతు సంఘం నాయకులు గన్నేబోయిన విజయభాస్కర్, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News