Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్

25-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, బూట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ విద్యార్థులకు స్వయంగా బ్యాగులు, పుస్తకాలు, బూట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడం ద్వారా వారి చదువుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మంచి మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మాజీ మండల అధ్యక్షులు తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, మైతాబ్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News