Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్
25-08-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లు పెంచాలి: సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్

చిట్యాల: మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ. మల్లేశం హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు విరివిగా పెంచితే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. కోతుల బెడదను నివారించేందుకు అడవులు, గుట్టల్లో పండ్ల చెట్లను పెద్ద ఎత్తున పెంచాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అలేందర్‌రెడ్డి, ఫారెస్ట్ బీట్ అధికారులు శిరీష, భవాని, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, స్వాతి, పూలమ్మ, సుస్మిత, మమత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News