Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

25-08-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 'వనమహోత్సవము 2026' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 13వ వార్డు, జయభూమి వెంచర్ బాలాజీ టెంపుల్ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. "మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే నినాదంతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ... పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించి రాబోయే తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే చెట్లు నాటడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. చౌటుప్పల్ పట్టణంలో ఉన్న 30 శాతం అడవి ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ​వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుంచే మొక్కలు నాటే అలవాటు పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, పాక చిరంజీవి, పిల్లల మర్రి మధుసూదన్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగారాములు, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, ఉడుగు రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, ఫారెస్ట్ అధికారి మెహరాజ్, ఐరా పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ బి. మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News