బాలల హక్కుల పరిరక్షణ, బాలలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించేందుకు నోడల్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కొత్తచెరువులోని ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీస్‌లో మంగళవారం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మరియు పీడీ ఐసీడీఎస్ వారి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO) మహేష్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాలల న్యాయ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, బాలల హక్కులు మరియు కిశోర వికాసం తదితర అంశాలపై నోడల్ టీచర్లకు అవగాహన కల్పించారు.
ప్రతి శనివారం నిర్వహించే కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా 12 ముఖ్యమైన అంశాలను వారానికి ఒక అంశం చొప్పున విద్యార్థులతో చర్చించి, వారికి అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల సమస్యలను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల సహకారంతో వారికి రక్షణ, మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా కొత్తచెరువు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ మాట్లాడుతూ, పిల్లలు చిన్న చిన్న సమస్యలకు తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారికి నిరంతరం మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తూ, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించుకుని, నైతిక విలువలతో విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.
అదేవిధంగా ఈగల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, జీసీడీఓ, సర్వశిక్ష అభియాన్ అధికారులు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు నాగలక్ష్మి,మురళీధర్, మేనేజర్ సునీత, డీసీపీయూ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన నోడల్ టీచర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి