Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:06 PM

వేప చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

వేప చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

వేప చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి
25-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వట్టిమర్తి రెవెన్యూ పరిధిలో ఘటన.. మృతుడి వయసు 40–45 ఏళ్లు.

చిట్యాల మండలం వట్టిమర్తి రెవెన్యూ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. MPL కంపెనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద వేప చెట్టుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఉండటాన్ని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

మృతుడి ఒంటిపై గోధుమ రంగు ఫుల్‌హ్యాండ్‌ షర్టు, సిమెంట్‌ రంగు ప్యాంటు ఉన్నాయి. ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయనకు సంబంధించిన వివరాలు తెలిసినా వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం కోసం:

చిట్యాల ఎస్‌ఐ: 8712670187

నార్కట్‌పల్లి సీఐ: 8712670148

చిట్యాల పోలీస్‌ స్టేషన్: 8712667731

Sthanikam

వేప చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News