Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు

26-08-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను మైనార్టీ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా యువత, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మతపరమైన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ వేడుకలు గ్రామంలో మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

Sthanikam

తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను మైనార్టీ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా యువత, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం, సమానత్వం వంటి విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి కంగ్టి పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్గా రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మతపరమైన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ వేడుకలు గ్రామంలో మత సామరస్యం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News