Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

దోమల బెడద నివారణకు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు

Updated : 26 Aug 2026 20:23 IST
As Preferred Source 1 min read
దోమల బెడద నివారణకు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు

వర్షాకాలంలో దోమలు, క్రిమికీటకాల బెడద పెరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కోహీర్ మండలం గురుజువాడ గ్రామంలో క్రిమిసంహారక మందు పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టారు. సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, మురుగు కాలువలు, కాలనీ ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

దోమల బెడద నివారణకు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు

Article Image

వర్షాకాలంలో దోమలు, క్రిమికీటకాల బెడద పెరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కోహీర్ మండలం గురుజువాడ గ్రామంలో క్రిమిసంహారక మందు పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టారు. సర్పంచ్ ప్రియాంక రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, మురుగు కాలువలు, కాలనీ ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news