Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

26-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం, అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. క్షతగాత్రుల చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు.

Sthanikam

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News