Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:03 PM

మణికంఠ నగర్‌లో ఘనంగా మద్దెలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన

26-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​పదవ వార్షిక బోనాల మహోత్సవాలు ప్రారంభం

వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ, అన్నప్రసాద వితరణ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠ నగర్‌లో వెలసిన శ్రీశ్రీశ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో పదవ వార్షిక బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక, నందీశ్వర సహిత శివలింగం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శ్రావణ నక్షత్ర యుక్త తులా లగ్నంలో నయనమనోహరంగా నిర్వహించారు. ​ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం గావించారు. అనంతరం శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి మాట్లాడుతూ..27వ తేదీన శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం నుండి మహిళా భక్తులు బోనాలతో బయల్దేరి, బొడ్రాయి చుట్టూ తిరిగి మద్దెలమ్మ అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. అనంతరం భక్తులందరికీ భారీ అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు గుర్రం నరసింహ, కార్యదర్శి గోశిక అంజయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బడుగు మోహన్ బాబు, మార్కండేయ స్వామి దేవాలయ అధ్యక్షులు బడుగు ప్రకాష్, ఉపాధ్యక్షులు వనం రాజు, చిక్క నరహరి, సహాయ కార్యదర్శి కందగట్ల ఆనంద్, సుంకి రవికుమార్, గోశిక కరుణాకర్, పిల్లలమర్రి యాదగిరి, గోశిక భాస్కర్, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, రుద్ర యాదగిరి, కోడి వనిత, వనం జయశ్రీ, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, గోశిక రవి, గోశిక వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మణికంఠ నగర్‌లో ఘనంగా మద్దెలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News