Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం

27-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్థానిక విశాల భారతి హైస్కూల్‌లో గురువారం బోనాల వేడుకలు, శ్రావణ వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, శివసత్తుల రూపంలో బోనాలతో అలరించారు. మరికొందరు విద్యార్థులు పోతురాజుల వేషధారణతో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు నిర్వహించారు.​ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన బోనాల ఉత్సవాలు మన సంస్కృతీ సాంప్రదాయాలకు, విశిష్టతకు ప్రతీకగా నిలుస్తాయని కొనియాడారు. విద్యార్థులకు మన ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకే ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను, దైవచింతన వల్ల కలిగే శుభ ఫలితాలను విద్యార్థులకు వివరించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News