Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

Updated : 27 Aug 2026 17:23 IST
As Preferred Source 1 min read
ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

పని దొరక్క ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ వెల్డింగ్ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పురపాలక వర్గం పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బతుకుతెరువు కోసం రెండేళ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

​గత నాలుగు రోజులుగా పని దొరకకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 26) రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు అంబటి జోగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news