Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

Updated : 27 Aug 2026 08:15 IST
As Preferred Source 1 min read
డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

చైతన్యపురి: డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట నేతాజీనగర్‌కు చెందిన కలాల్‌ భవానీ (26) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 25న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో భర్త బోల్గాం నరేష్‌గౌడ్‌ చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భవానీ ఇంటి నుంచి వెళ్లే సమయంలో గ్రే రంగు షర్ట్‌, గ్రీన్‌ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

Article Image

చైతన్యపురి: డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట నేతాజీనగర్‌కు చెందిన కలాల్‌ భవానీ (26) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 25న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో భర్త బోల్గాం నరేష్‌గౌడ్‌ చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భవానీ ఇంటి నుంచి వెళ్లే సమయంలో గ్రే రంగు షర్ట్‌, గ్రీన్‌ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news