Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:54 PM

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్

27-08-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ గోపతి సతీష్ హెచ్చరించారు. రాఖీ పండుగ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోలీస్‌స్టేషన్‌లో రాఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐతోపాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎవరైనా వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, సోషల్‌ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. ఆడపిల్లల రక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు మహేష్, శ్రావ్య, అనూష, పల్లవి, మానస, నవదీప్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News