Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు
27-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కౌన్సిల్

సమావేశంలో రూ. 53.52 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

నూతన భవన నిర్మాణానికి రూ. 9.65 కోట్లు కేటాయింపు

ఎజెండా చర్చల వేళ ప్రతిపక్ష కౌన్సిలర్ల వాకౌట్

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ. 53.52 కోట్ల (రూ. 53,52,23,300/-) అంచనా వ్యయ ప్రతిపాదనలకు కౌన్సిల్ పరిపాలనా ఆమోదం తెలిపింది. చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​సమావేశంలో అధికారుల నివేదికల అనంతరం ఎజెండా అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఆ తర్వాత కొనసాగిన సమావేశంలో, వార్డు బౌండరీల లోపలే ఎలక్షన్ ఓటర్ల జాబితా (సర్) ప్రక్రియను చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ​

రూ. 53.52 కోట్ల బడ్జెట్ కేటాయింపుల వివరాలు

యుసిఎఫ్ బృహత్ ప్రాజెక్టులు రూ. 38.00 కోట్లు (మల్టీఫంక్షన్ హాల్, గాంధీ పార్క్ టౌన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్), ​నూతన మున్సిపల్ భవనం రూ. 9.65 కోట్లు, ​ఘన వ్యర్థాల నిర్వహణ రూ. 2.64 కోట్లు (డి ఆర్ సీసీ, స్మశాన వాటిక), ​అత్యవసర వార్డు పనులు రూ. 1.90 కోట్లు (34 రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం), ​వీధి దీపాల నిర్వహణ రూ. 50.00 లక్షలు, ​పారిశుధ్యం, సేఫ్టీ గేర్ రూ. 44.00 లక్షలు,

​వేసవి తాగునీటి ప్రణాళిక రూ. 36.00 లక్షలు, ​వేతనాలు, శిక్షణ రూ. 3.23 లక్షలు,​పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ వెల్లడించారు.

Sthanikam

చౌటుప్పల్‌ అభివృద్ధికి రూ. 53.52 కోట్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News