Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళల భద్రతకు పోలీసులే అండ.సీఐ రవి బాబు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:18 PM

రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ

27-08-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాఖీ పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం జిల్లాలో పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లలో షీ టీమ్స్‌ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని తెలిపారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా లేదా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినా షీ టీమ్‌ నంబర్‌ 8712656772కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు రాఖీ పౌర్ణమిని ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం.. నువ్వు ధరించే హెల్మెట్‌ నీ ప్రాణానికి రక్షణ కవచం. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు.. నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించండి అని ఎస్పీ ప్రజలకు సందేశం ఇచ్చారు.

Sthanikam

రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News